యాదాద్రి భువనగిరి జిల్లా (ఏప్రిల్.29)
జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం నెమరగోముల పిపిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి,రైతులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసిన పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రంలో సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.రైతులు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు తొందరగా ముగించుకొని,వరి ధాన్యాన్ని ఆరబోసుకుని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రైతులకు సూచించారు.సకాలంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని రైతులకు తెలియజేశారు.





