మతిస్థిమితం లేని వృద్దురాలను వృద్ధాశ్రమంకు తరలించిన గుగులోతు రమేష్
తన జీవితాన్నే ప్రజా సేవకు అంకితం చేసిన గుగులోతు రమేష్
బోనకల్, మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా, జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 29 :- గత 15 రోజులుగా ఒక మతిస్థిమితం లేని వృద్ధ మహిళ ఒరిస్సా నుండి బోనకల్ మండల కేంద్రానికి చేరుకొని ఆ వీధి ఈ వీధి తిరుగుగుకుంటూ మండల కేంద్రంలో గల తీగల శ్రీదేవి అనే మహిళ కూల్ డ్రింక్ షాప్ దగ్గర కు చేరుకొని జీవనం కొనసాగిస్తుంది.. ఆమెకు సరిగ మతిస్థిమితం లేకపోవడంతో సమయానికి భోజనం పెట్టేవారు లేక కనీసం నిరంధించేవారు లేక ఇబ్బంది పడుతుంటే కూల్ డ్రింక్ షాప్ యజమాని తీగల శ్రీదేవి బోనకల్లు గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్ కు సమాచారం అందించింది. రమేష్ తక్షణమే స్పందించి అక్కడకు వెళ్లి వృద్ధ మహిళకు భోజన సదుపాయాలు అందించి. ఆమె సమాచారం బోనకల్ ఎస్సై మధు బాబుకు విషయం తెలియజేసి స్థానికంగా ఉన్న వృద్ధుల వృద్ధాశ్రమంలోకి మతిస్థిమితం లేని వృద్దురాలను తరలించి ఆమె గురించి వృద్ధాశ్రమం నిర్వాహకులతో మాట్లాడి రమేష్ మానవత్వం చాటుకున్నారు.
ఆ మతిస్థిమితం లేని వృద్ధ మహిళా ఉన్నట్లు కొంతమంది అధికారులకు తెలియజేసిన కూడా వారు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. రమేష్ కి తెలిసిన వెంటనే స్పందించి ఆ మహిళలకు సహాయం చేయడంతో స్థానికులు గుగులోతు రమేష్ ను అభినందించారు.





