— గోడపత్రికను ఆవిష్కరించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఉగాది వసంతాలు పూర్తి చేసుకొని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ సీఎం కేసీఆర్ గత ప్రభుత్వంలో పేదలకు దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారు.తిరిగి ఈ రాష్ట్రంలో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కాయం అని అన్నారు.కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం 27వ తేదీన వరంగల్ ఎలకతుర్తి లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని భువనగిరి నియోజకవర్గం ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోభువనగిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమసు రమేష్,పిఎసిఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్,చందుపట్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ చందుపట్ల రాజేశ్వర రావు,పిఎసిఎస్ డైరెక్టర్ గుమ్మడి సురేందర్ రెడ్డి,అడ్వకేట్ సామ రాజేందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కుతాడి సురేష్,మోతే మనోహర్,రాగుల కార్తీక్,యట గణేష్,ఆనంద్,వెంకటేష్,చందు,నరేష్,సన్నీ తదితరులు పాల్గొన్నారు.





