కేంద్ర ఆర్థిక శాఖ సహాయ రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి
పాలసముద్రం,జన సముద్రం న్యూస్,ఏప్రిల్ 25:-
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది అనికేంద్ర ఆర్థిక శాఖ సహాయ రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు.శుక్రవారం పాలసముద్రంలో నాసిన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.పాలసముద్రం లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అకాడమిలో 75వ ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి హాజరయ్యారు. రెండవసారి నాసిన్ అకాడమీకి వచ్చిన మంత్రి పరేడ్ ను పరిశీలించి,ట్రైనీ ఐపీఎస్ ల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

అనంతరం ట్రైనీ ఆఫీసర్లకు బంగారు పథకాలను అందించారు.ఈ సందర్భంగా మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు.స్టార్టప్ ఇండియా,స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాలు ప్రవేశపెట్టి పేద బలహీనవర్గాల యువతి యువకులకు ఉపాధి కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా పని చేస్తుందన్నారు. 2047 నాటికి వికసిత భారత్ ద్వారా భారతదేశ దిశా దశ నిర్దేశాన్ని మార్చడమే ముఖ్య ఉద్దేశమని పంకజ్ చౌదరి తెలిపారు.ప్రపంచ స్థాయి వసతులు కలిగిన ఈ నాసిన్ అకాడమీలో రెండవ బ్యాచ్ లో42 మంది అధికారులు ఉన్నారు వీరులు 25 మంది పురుషులు,17 మంది మహిళా అధికారులు ఉన్నారు,వీరిలో రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ చెందినవారు 5 మంది అధికారులు ఉన్నారు.

రెండవ బ్యాచ్ అధికారుల పాసింగౌట్ పారెడ్ కి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు.మన మిత్ర దేశమైన భూటాన్ అధికారులు కూడ ఇక్కడ ట్రైనింగ్ కావడం ఇరు దేశాల మైత్రికి దోహద పడుతుందన్నారు.ప్రధానమంత్రి నరేద్ర మోదీ భారతదేశ అభివృద్ధి,యువత కోసం ఎన్నో ఆకర్షణనీయ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.సేవభావం,దేశ భక్తితో విధులు నిర్వహించాలి అని ప్రధానిమోదీ భావనను మనసులో ఉంచుకుని తమ తమ విధుల్లో ప్రతిభ చాటాలన్నారు.పాలసముద్రంలోని ఈ అకాడమీ నిర్వహణలో ఛైర్మెన్ సంజయ్ కుమార్ అగ్రవాల్,డైరెక్టర్ జనరల్ డా.సుబ్రహ్మణ్యం యొక్క పాత్ర కీలకమన్నారు.భవిష్యత్తులో మరింత మంది సమర్ధత కలిగిన అధికారులు దేశ సేవ చేయడం కోసం ఈ అకాడమీ నుంచే రావడంజరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో సి బి ఐ సి బోర్డు మెంబర్,అరుణ నారాయణ,గుప్త,తదితరులు పాల్గొన్నారు.





