జన సముద్రం న్యూస్ కోహెడ ఏప్రిల్ 23:( కోహెడ ప్రసాద రావు)
గాలి దూమరంతో అకాల వర్షంతో ఒకరి ఇంటి పైకప్పు రేకులు కొట్టుకపోయి నష్టం కలిగించిన ఉదంతం ఇది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వేంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ మాధర్ ఇంటి పైకప్పు కొట్టుకపోయాయి. గోడలు కూలిపోయి తీవ్ర నష్టం కలిగింది. సోమవారం ఈదురు గాలులతో పై కప్పు రేకులు కొట్టుకపోయి నష్టం కలిగించడంతో కుటుంబాన్ని రెవెన్యూ అధికారులు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ స్థానిక తాజమాజి ఎంపీటీసీ ఖమ్మం స్వరూప వెంకటేశంవిజ్ఞప్తి చేసారు.
వేంకటేశ్వరపల్లిలో సోమవారం సాయంత్రం పెద్దఎత్తున గాలి దూమరం అకాల వర్షం కురిసి బండ కొట్టుకొని జీవించే కాశీతుర్క నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ మాధర్ ఇంటికప్పు గోడ కూలి సుమారు 50.వేల ఆస్తినష్టం వాటిల్లిందని ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని అలాగే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ తాజమాజి ఎంపీటీసీ ఖమ్మం స్వరూప వెంకటేశం కోరారు.





