ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ మార్చి 04
తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ కళాశాల విద్యాశాఖ వారు డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన జిజ్ఞాస ప్రాజెక్టు కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉట్నూరు నుండి రెండు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని ప్రిన్సిపాల్ టి. ప్రతాప్ సింగ్ అన్నారు. తెలుగు విభాగం నుండి జె.యోగ లక్ష్మి మార్గదర్శకత్వంలో ఆదిలాబాద్ జిల్లా తోటీలు – జీవనస్థితిగతులు*, ఫిజిక్స్ విభాగం నుండి శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో యుటిలైజేషన్ ఆఫ్ ప్లాస్టిక్ అనే అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపిక అవడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ టి. ప్రతాప్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన విద్యార్థులను, మార్గదర్శకులను కళాశాల బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి ప్రసాద్, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ నర్సింగ్ రావు, డాక్టర్ రాణి,పిడి అనిత, షేక్ ముజీబ్, పెంటన్న,కపిల్, వినిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





