మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘాట్కేసర్ మున్సిపల్ అధికారుల వింత పోకడ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (మార్చి.04)
జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపాలిటీ:-ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం రోజు రోజుకు నిరుపయోగంగా మారుతుంది.సాధారణ రోజుల్లో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే అధికారులు ఎలాగో స్పందించారని కనీసం ప్రజావాణి కార్యక్రమం ఉన్న రోజైన అధికారులు ఎందుకు ఉండరని ఇలాగైతే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.జిల్లా కలెక్టర్ పర్వవేక్షణ లేకపోవడం వల్లనే ఘాట్కేసర్ మున్సిపల్ అధికారులు ప్రజల పట్ల,ప్రజావాణి కార్యక్రమం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తీరు మార్చుకోవాలని,ప్రజావాణి కార్యక్రమాన్ని నవ్వులపాలు చేసిన ఘాట్కేసర్ మున్సిపల్ కమిషనర్ పై మేడ్చల్ జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని,ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృత్తం కాకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





