రోడ్డు పై ఉన్న గుంతలతో ప్రమాదాలు
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 28 ఫిభ్రవరి
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం ఇల్లందకుంట (అపర భద్రాద్రి) మండలం ఆవాస ప్రాంతంలో రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో వాహన దారులు, ఆటో డ్రైవర్ లు, కార్మికులు, వ్యాపారస్తులు తీవ్రమైన తమ ఆవేదనలను వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు, నాయకులలో ఏమాత్రం చలనం లేకుండా పోయింది.
కొత్తగా ఏర్పడిన మండలం అయినప్పటికీ అభివృద్ధి కి ఆమడదూరంలో ఉంది.
ఇల్లందకుంట నుండి సిరిసేడు మార్గమున గల ఈ రోడ్డు పై ఉన్న గుంతలు పూడ్చాలని కోరుతున్నారు.
పైపు లైన్ లీకేజీ మూలంగా రోడ్డు పై నీరు నిలిచియుండగా పూర్తిగా దుర్గంధం వెదజల్లుతుంది.
రోడ్డు కు ఇరువైపుల
డ్రెయినేజీ కాలువల నిర్మాణం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
తక్షణమే పాలకులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు పై ఉన్న గుంతలు పూడ్చాలని వాహన దారులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు కోరుతున్నారు.





