(జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి // హుజురాబాద్)
జనసముద్రం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను హుజురాబాద్ నియోజక వర్గం టౌన్ సిఐ జి తిరుమల్ ఆవిష్కరించారు.హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో జనసముద్రం న్యూస్ కరీంనగర్ సబ్ ఎడిటర్ పల్లె సతీష్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. ఆవిష్కరిస్తూ సీఐ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు చందుపట్ల జనార్ధన్ ,బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కని సంజయ్, పూలే కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, బీసీ రాష్ట్ర కార్యదర్శి సందేల వెంకన్న , జనసముద్రం న్యూస్ రిపోర్టర్ మట్టెల సంపత్ ,రిపోర్టర్ ఇప్పకాయల సాగర్ పాల్గొన్నారు





