(జనసముద్రం న్యూస్ కరీంనగర్ //ప్రతినిధి జనవరి3 జమ్మికుంట)
జమ్మికుంట పట్టణంలో గురువారం రోజున రిషిక పిల్లల హాస్పిటల్, వనిత స్కిన్ క్లినిక్ ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు. ఆసుపత్రిలోని వార్డులను మరియు ఫార్మసీ రూములను తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు గురించి, పేషెంట్స్ కు సరైన సౌకర్యాలు కల్పించాలని వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయరాదని అని అన్నారు.ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించకూడదని ప్రభుత్వ నిబంధనలకు లోబడి వైద్యం అందించాలని ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆసుపత్రి ప్రతినిధులను హెచ్చరించారు.అలాగే ధర్మారం పల్లె దవాఖానను తనిఖీ చేయడంతో పాటు ధర్మారంలో జరుగుతున్న వందరోజుల టీబీ నిక్షయ్ శివిర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. టిబి నిక్షయ్ శివిర్ కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలని వైద్య సిబ్బందికి సూచించడంతోపాటు సమయపాలన పాటించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఒకవేళ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని వైద్య సిబ్బందిని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ విజయ్ కుమార్,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యాం నాయక్,డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ అరుణ, టిబి సూపర్వైజర్ దేవేందర్ రెడ్డి,ల్యాబ్ సూపర్వైజర్ చదువు కిరణ్, ఏఎన్ఎం కవిత తదితరులు పాల్గొన్నారు.





