పుల్లంపేట మండలంలో అరాచకాలు ఎక్కువ..!! ప్రశ్నించే వాళ్లు తక్కువ..!!
ఎనొ తూర్లు గవర్నమెంట్లు మారినా.. మా జీవితాలు ఇంతే.. అంటున్న బాధితుడు??
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ నవంబర్ 03 జన సముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం, శ్రీరాముల పేట లో నివాసం ఉంటున్న మల్లెం రమణ ఎలక్ట్రానిక్ వర్క్ చేసుకుంటు ఉండేవాడు.
గత రాత్రి శుక్రవారం రమణ కు టీడీపీ పార్టీ కార్యకర్త కేతారాజు పల్లి కి చెందిన వెంకట సుబ్బయ్య ఫోన్ చేసి మా గ్రామంలో విద్యుత్ పోల్స్ కు లైట్స్ బిగించాలని చెప్పడం తో బాధితుడు రమణ ఉండి మీరు ఇచ్చే తక్కువ డబ్బుకు నేను లైట్స్ బిగించలేనని సమాధానం చెప్పడంతో, దళయుపల్లి కి చెందిన మల్లు రాజరెడ్డి, మణి, వెంకట సుబ్బయ్య, సాయి, హార్సవర్ధన్ రెడ్డి, మణికంఠఈశ్వర్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి ఇంకా కొంతమంది భాధితుడు మణి ఇంటి దగ్గర కు వచ్చి దారుణంగా కొడుతుండగా భాధితుడు భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్ళి పోలీసులు కు చెప్పడంతో, రాజరెడ్డి, వెంకట సుబ్బాయ్య భాధితుడిని కొట్టి బైక్ లో వేసుకొని దళయుపల్లి కి వెళ్తుండగా దారి మధ్యలో పోలీసులు అడ్డుపడి నా భర్త ప్రాణాలను కాపాడేరని పోలీసులు లేకుంటే నా భర్తచంపేవాళ్ళని, టీడీపీ పార్టీ నాయకులు కేషు ని తారుమారు చేయాలని చుస్తే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుపుతనని, భాధితుడు మల్లెం రమణ భార్య మల్లెం వెంకట సుబ్బమ్మ మీడియా కు తెలిపారు. ఈ విషయంపై విలేకరులు పుల్లంపేట ఎస్సై కి ఫోన్ చేయగా నిన్న డ్యూటీలో నేను లేను ఏం జరిగిందో సమాచారం తెలుసుకొని దాడి చేసిన వాళ్లపై కేసు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది అంటూ రిపోర్టర్ చెప్పుకొచ్చాడు…