జగన్ కు వార్నింగ్.. షర్మిలకు రక్షణ కల్పిస్తానన్న పవన్

Spread the love

జనసముద్రంన్యూస్, నవంబర్ 3, మంగళగిరి.

దీపావళి సందర్భంగా దీపం-2 పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడివిడిగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో చంద్రబాబు ఆ పథకం మొదలుబెట్టగా, ఏలూరు జిల్లాలో ఈ పథకం ప్రారంభోత్సవం తర్వాత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ నోళ్లు లెగుస్తున్నాయని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామని పవన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తొక్కి పట్టి నారతీస్తానని హెచ్చరించారు. భవిష్యత్తులో వైసీపీ నేతల నోళ్లు లేవకుండా చేస్తానని పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

తమది మంచి ప్రభుత్వమే గానీ, మెతక ప్రభుత్వం కాదని, యుద్ధం కావాలంటే మంచి పాలనతో యుద్ధమే చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ దోపిడీ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అందుకే వారిని తరిమికొట్టినా వాళ్ళ నోళ్లు మూతపడడం లేదని పవన్ అన్నారు. సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేలాగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
ఆడబిడ్డల మానప్రాణాలకు ఇబ్బంది కలగకుండా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని, ఆడపిల్లల గురించి అసహ్యంగా తాము మాట్లాడలేదని పవన్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం పథకాల సరిగా అమలు చేయలేదని పవన్ అన్నారు. హామీలు అమలు కాకుంటే జన సైనికుల ప్రేమ ఎంత బలంగా ఉంటుందో కోపం కూడా అంతే బలంగా ఉంటుందని, పదవి వచ్చిన తర్వాత పదింతలు ఎక్కువగా కష్టపడే వ్యక్తిని తాను అని చెప్పారు. ఇక, తనకు ప్రాణహాని ఉందని షర్మిల దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం తప్పకుండా ఆమెకు రక్షణ కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. అమ్మా షర్మిల మీ అన్న రక్షణ కల్పించలేకపోయాడు.. కానీ, మీకు ఈ కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుంది అని పవన్ అన్నారు. బాధ్యత గల నాయకురాలిగా విమర్శలు చేయొచ్చని, కానీ ప్రాణహాని ఉందంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి షర్మిలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.

  • Related Posts

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    Spread the love

    Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు