జనసముద్రం,అక్టోబర్30 బ్యూరో చీఫ్ టిజి &ఎపీ.
మన దేశంలో(ప్రతి కుటుంబంలో) మహిళలు సఖ భాగం కంటే అధికంగానే ఉంటారు. గత సంవత్సరం చివరిలో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ లో మహిళలకు ఉచితoగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అప్పటి పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. గత 11 నెలలుగా ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో ఆర్టీసీలో ప్రయాణ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఈ కారణంగా పండుగలకు , పర్వదినాలకు మహిళలు పుట్టిళ్ళకు, పుణ్యక్షేత్రాలకు అధిక సంఖ్యలోని ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీలో ప్రజా రవాణా అధికమవుతూ వస్తోంది. పండుగల సమయంలో ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఉచిత బస్సు సౌకర్యం పేద విద్యా ర్ధినులకు వరంగా మారడంతో తల్లిదండ్రులు కూడాహర్షం వ్యక్తo చేస్తున్నారు.
గురువారం దీపావళి పండుగ కావడంతో తెలంగాణలో ఉన్న మహిళలు టిజిఆర్టిసి బస్సులలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉచితప్రయాణం చేస్తూ ఆధార్ కార్డులు చూపిస్తూ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆడపడుచులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.