(
(అక్టోబర్.30) జనసముద్రం న్యూస్,కరీంనగర్)
జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన నరేష్ -నేహా దంపతుల 11 నెలల బాబు రియాన్స్ కు తీవ్రంగా జ్వరం రాగా సోమవారం రోజున జమ్మికుంట పట్టణంలోని వాత్సల్య పిల్లల హాస్పిటల్ కు తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బాబు తల్లిదండ్రులు హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో రియాన్స్ కు తీవ్ర జ్వరంతోపాటు ఫీట్స్ రావడంతో మార్గమధ్యంలోనే మరణించాడు, తీవ్ర కలత చెందిన బాలుని తల్లిదండ్రులు చేసేదేమీ లేక తిరుగు ప్రయాణం ఇంటికి వెళ్లి మంగళవారం ఉదయం మొదట చికిత్స జరిపిన జమ్మికుంట లోని ప్రైవేటు హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడు అనే అభియోగంతో జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విచారణ జరిపిన జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి మాట్లాడుతూ ఇందులో ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం ఏమి లేదని బాబుకు అతి జ్వరంతోపాటు ఫీట్స్ రావడం వలన సాధారణంగా మరణం సంభవించిందని తల్లిదండ్రులు నిర్ధారించుకొని కేసును వాపస్ తీసుకున్నారని పట్టణ సీఐ వరగంటి రవి, తెలిపారు…