చింతూరు జన సముద్రం న్యూస్ అక్టోబర్30:
మధ్యo దుకాణాలకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సరతులు విధించినప్పటికిను పట్టించుకోకుండా పిసా గ్రామ సభలను తుంగలో తొక్కి మద్యం షాపులు ప్రారంభిస్తున్నారు.
ప్రభుత్వము స్కూల్స్,అంగన్వాడి స్కూల్స్, గుడి, జనవాసానికి దూరంగా మరియు పిసా గ్రామ సభ తప్పకుండా ఉండాలి అని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా షాపులు తెరుస్తున్నారు. ప్రజలు అనేక మార్లు అధికారులకి ఎక్సేంజ్ శాఖ అధికారులకి ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకనీరుతున్నట్టు ఉన్నారని గ్రామస్తులు వాపోతున్నారు.