యాక్సిడెంట్ చేసిన కారుని, ఆర్టీవో కు తెలియకుండా…!!డ్రైవర్ ని, సకలమర్యాదలతో పోలీస్ వారు ఇంటికి పంపించడం..!!
యాక్సిడెంట్ చేసిన వ్యక్తిది ఆధార్ కార్డులో ఉన్న పేరుని పెట్టకుండా..!! కేసును డైవర్ట్ చేయడం ఏంటయ్యా…!!
యాక్సిడెంట్ చేసిన వారని… డ్రైవర్ని.. వదిలిపెట్టడం..!! ఎంత మాత్రం సమంజసమో మీరే చెప్పాలి పోలీసు వారు..??
ఆర్టీవో వారు అడిగితే తిరుపతిలో ఉంది అంటూ…!! తెలంగాణకు పంపించేసేయడం ఏంటయ్యా..??
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ అక్టోబర్ 26 జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైల్వేకోడూరు మండలంలో మాధవరం పోడు గ్రామంకు చెందిన, ఎస్ నరసింహారాజు. వారి కుమారుడు ఎస్ కుశల్..! వీళ్ళిద్దరూ ఈ నెల రెండో తేదీన అమావాస్య రోజు కావడంతో గుడికి బయలుదేరడం జరిగినది, వారు మాధవరం నుంచి 716 హైవే రోడ్డుపైన కోడూరుకి ఉదయాన్నే ఆరున్నర గంటల సమయంలో వస్తూ ఉండగా.. తిరుపతికి వెళుతున్న టాటా హారియర్ కారు T S 03FF6699 వెహికల్ పూర్తిగా ఆపోజిట్ సైడ్ కు వచ్చి వెళుతున్న మోటార్ బైక్ ని గుద్దడం జరిగినది, వారిని దగ్గరలో ఉన్న గ్రామస్తులు 108 కి ఫోన్ చేసి అమర హాస్పిటలకు తీసుకువెళ్లడం అక్కడ వీరి పరిస్థితి బాగాలేని ఎడల తిరుపతిలోని రమాదేవి హాస్పిటల్ కి తీసుకెళ్లడం.. అక్కడ వీలుకాదు అంటే “ఏలూరులొని సిఎంసి హాస్పిటల్” లో చేర్చడం జరిగినది, ఎస్. నరసింహ రాజు కు కాళ్లు మరియు నడుములో పూర్తిగా నుజ్జు కావడం వల్ల అతను ఐదు రోజుల తర్వాత చనిపోవడం జరిగినది, వాళ్ళ కుమారుడు ఎస్ కుసులకి కాల్ పూర్తిగా ప్యాక్స్ కావడం వల్ల మూడు చోట్ల స్టీల్ రాడ్స్ వేయడం జరిగినది.
వివరాల్లోకెళ్ళితే:- యాక్సిడెంట్ అయిన తరువాత కారుని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్టడం జరిగినది.. పోలీస్ వారు అదే రోజున త్రీ నాట్ ఫోర్ కింద ఆల్టర్ చేసి కేసు కట్టడం జరిగినది ..ఆ తరువాత యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ని వదిలిపెట్టడం వారం రోజులు తరువాత వచ్చి వాళ్ళ కారుని తీసుకెళ్లి పోవడం జరిగినది…!!కానీ ఆ కార్ ని కోర్టుకు గాని… ఆర్టీవో గాని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసు వారు ఆ కార్ ని పంపించడం జరిగినది.. దానిమీద వివరాల అడిగితే ఆ కారును మరలా తెప్పిస్తాము.. అంటూ 15 రోజులుగా మాటలతోనే తోచుపుచ్చుతు సరైన సమాధానం చెప్పకుండా యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని తీసుకురాకుండా రోజులు గడిపేస్తున్నారు యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఎస్ నరసింహారాజు s/o తాతం రాజు… చనిపోయి 11 రోజులు అవడంతో కర్మాంత్రం కూడా జరిగినది… కానీ ఇప్పటివరకు పోలీస్ వారు గాని ఆర్టీవో వారు గాని యాక్సిడెంట్ అయిన వారికి ఎటువంటి న్యాయం చేయకుండా పంపించడం ఎంత మాత్రం సమంజసంమో వాళ్ళు చెప్పాలి..
మరొక విషయం ఏమిటంటే ఎఫ్ఐఆర్ 304 ఆల్టర్ చేసిన కేసులో మన పోలీసు వారు డ్రైవర్ ఆధార్ కార్డులో.. “ఇవా ళ్ల రవిచంద్ర”..!! అని ఉంటే .. కేసులో మాత్రం “ఇవా ఆయన ఇవాళ్ల రవీంద్ర”..?? అని కేసు ఆల్టర్ చేయడం జరిగినది.. వీళ్ళు చేస్తున్న విధానాన్ని బట్టి చూస్తుంటే రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. దయచేసి అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయవలసిందిగా ప్రజలు విశ్లేషకులు కోరుతున్నారు..