అప్పులు తెచ్చి ఆర్థిక సమస్యల్లో కోరుకుపోవద్దు
ఆన్లైన్ మోసాలపై మండల ప్రజలు తగిన జాగ్రత్త వహించాలి .ఎస్సై ప్రవీణ్ కుమార్
మునగాల ప్రతినిధి, జనసముద్రం న్యూస్ అక్టోబర్ 26
సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా పుట్టుకొస్తున్న ఆన్ లైన్ యాప్ లో ఆర్థికంగా పెట్టుబడులు పెడితే తిరిగి రెట్టింపు నగదు వస్తుందని అపోహలని మండల ప్రజలు ఎవరు నమ్మి మోసపోవద్దని మునగాల ఎస్ఐ బి ప్రవీణ్ కుమార్ అన్నారు, శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, మండలంలో ఈ మధ్యకాలంలో ఆర్జిఏ యాప్ పేరుతో ప్రజలు పెద్ద ఎత్తున సమూహంగా ఒకరి నుండి మరొకరు అత్యాశకు పోయి వేల రూపాయలు అప్పులు తీసుకువచ్చి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టారని తీరా చూస్తే రెండు రోజుల క్రితం ఆర్జిఏ యాప్ సంస్థ ఎత్తివేయడంతో మండల ప్రజలు గగ్గులు పెడుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుందని, కావున నేటి ప్రస్తుత పరిస్థితుల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునే అనేక సోషల్ మీడియా యాప్ లు నడుపుతున్న సంస్థలు ప్రజల్ని మోసం చేసేందుకు రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తుంటారని, మండల ప్రజలు తగిన జాగ్రత్త చర్యలతో అత్యాశకు పోయి సోషల్ మీడియా వేదికగా వచ్చే ఆన్లైన్ యాప్ ల నందు ఎలాంటి పెట్టుబడులు పెట్టడం గాని లేదా ఇతర ఆర్థిక లావాదేవీలు కొనసాగించడం కానీ చేయవద్దని వారన్నారు, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఇలాంటి యాపుల్లో చేరాలని ప్రచారం చేసిన ఒత్తిడి తెచ్చిన వారి వివరాలని స్థానిక పోలీసులకు అందించాలని , అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇలాంటి ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టి సంస్థలు బోర్డులు తిప్పేసిన తర్వాత తీవ్రంగా నష్టపోయి ప్రజలు ఆర్థిక సమస్యల్లో కోరుకపోవద్దని వారు సూచించారు.