తొర్రూర్ డివిజన్ జన సముద్రం న్యూస్ అక్టోబర్ – 25
తొర్రూర్ మండలంలోని రైతు వేదికల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ప్రత్యక్య తరగతులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ జాతీయ నిర్మాణ రంగ సంస్థ ద్వారా భవన నిర్మాణ రంగంలో పనిచేయుచున్న 18-45 సం”ముల యువతి యువకులకు ఉచితంగా 15 రోజులు వృత్తి పరమైన నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వబడును, ఈ శిక్షణ తరగతుల్లో కోర్సులు మిషన్. బిల్డింగ్ వర్క్స్. మార్బుల్ . గ్రానైట్ లైట్ ఫ్లోరింగ్. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ శిక్షణ తరగతులు ఇవ్వబడును.
శిక్షణ సమయంలో ఉచిత మధ్యాహ్నం భోజన సదుపాయం కలదు. ఉచిత యూనిఫామ్ సేఫ్టీ హెల్మెంట్ ఇవ్వబడును. స్టియిపండ్ రోజుకు రూ ” 300/- చొప్పున 15 రోజులకు లేబర్ డిపార్ట్ మెంట్ ద్వారా రూ ” 4500/- లు ఇవ్వబడును. శిక్షణ అనంతరం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ స్కిల్ సర్టిఫికెట్ 80 శాతం అటెండెన్స్ ఉన్నవారికి ఇవ్వబడును. బ్యాగ్ కూడా ఇవ్వబడును. తొర్రూర్ మండలంలోని భవన నిర్మాణ కార్మికులు 40మంది శిక్షణ తరగతులు తీసుకుంటున్నారు. సెంటర్ ఇంచార్జి శ్రీనివాస్ వేణుగోపాల్