విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై అనూష
చొప్పదండి(జనసముద్రం న్యూస్):
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం నిర్వహించబడింది ఇందులో భాగంగా గీతవిద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు సంబంధించిన విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి స్టేషన్లోని విధులు ఎలా నిర్వహిస్తారు ఎలా కేసులు రిజిస్టర్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో ఏవిధమైన రికార్డులు మెయిన్టైన్ చేస్తాము, తుపాకుల గురించి టెక్నాలజీ లో వచ్చిన మార్పుల, ఆపద సమయంలో ఎలా రెస్పాండ్ అవుతాం అనే విషయాలు, డయల్ 100 నెంబర్ ఏవిధంగా పనిచేస్తుంది మొదలగు విషయాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ఇందులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారికి ఉన్న సందేహాలను అడిగి నివృతి చేసుకున్నారు గీతవిద్యాలయం ప్రిన్సిపల్ లింగరావు విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు