జనసముద్రం న్యూస్,25అక్టోబర్,అనంతపురం.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాల న్యాయవిద్య ఆరు నెలలు ఆలస్యం తో పూర్తయింది. ఐదవ ఆరో సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు రాయాలంటే మరో సంవత్సరం వేచి ఉండాలి. దీనికి తోడు ఎక్కువమంది ఒక సబ్జెక్టుతో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆరవ సెమిస్టర్ రివల్యూషన్ ఫలితాలు వెంటనే విడుదల చేసి ఒక సబ్జెక్టుతో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వెంటనే ఇన్స్టెంట్ ఎగ్జామ్ నిర్వహించి న్యాయం చేయాలని డైరెక్టర్ ఆఫ్ ఇవాల్యుయేషన్ జి. వి.రమణ మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సి.లోకేష్ గారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమస్య గురించి వెంటనే ఎస్కే యూనివర్సిటీ ఉపకులపతి అనిత, రిజిస్టర్ రమేష్ బాబు గారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తానని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఇదే సమస్య గురించి రెండు సంవత్సరాలుగా సమస్యలు ఎదుర్కొంటున్న అందువల్ల ఈ సమస్య గురించి యూనివర్సిటీ బోర్డు మీటింగ్లో ఉన్నత అధికారులతో నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎన్జీవో నేచురల్ జస్టిస్ లీగల్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డే రామకృష్ణ మరియు అనిల్ త్యాగరాజు మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ ఇవాల్యుయేషన్ జి. వి.రమణ మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సి.లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థుల కోసం ఎందాకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదే సమస్య గురించి శ్రీకృష్ణదేవరావు విశ్వవిద్యాలయ ఉపకులపతి అనిత రిజిస్టర్ రమేష్ బాబు నీ కలిసి ఫిర్యాదు చేసాం. కావున వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటు అనంతరం న్యాయ విద్యార్థి పోలా వీర ఫణిభూషన్ హేమంత రాజు మాట్లాడుతూ న్యాయ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది వెంటనే న్యాయ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే విద్యార్థి సంఘాలన్నీ ఏకమై పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో నేచురల్ జస్టిస్ లీగల్ అసోసియేషన్ సభ్యులు మరియు న్యాయ విద్యార్థులు వడ్డె రామకృష్ణ, అనిల్, రఘునాథ్, త్యాగరాజు, పోల వీర,ఫణిభూషణ్, హేమంత్ రాజు, జయరాజు, గుణశేఖర్, భీమా,చెన్నరెడ్డి,మేకల చంద్రశేఖర్ , త్రిలోక్, సుధాకర్ పాల్గొన్నారు.
మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల
Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…