భయభ్రాంతులకు గురి చేస్తున్న దళారులు
ఎన్నికలు నిర్వహించని మత్స్యశాఖ అధికారులు
మునగాల ప్రతినిధి జన సముద్రం న్యూస్
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని ముదిరాజులు మరియు బెస్తలు కలిసి సుమారుగా 600 మంది పైగా మత్స్యకారులు ఉన్నారు. 2018 నుంచి నేటి వరకు ఎలాంటి మత్స్యశాఖ ఎన్నికలు గాని జీవనోపాధికి సంబంధించి ఎలాంటి ఉపాధి అవకాశాలు కానీ లేవు. కొంతమంది దళారుల వలన మత్స్యశాఖ ఆగమైపోయి రోడ్డుమీద పడే పరిస్థితులు వచ్చాయి. గ్రామంలో రెండు పెద్ద చెరువులు ఉన్నాయని, చెరువులలో ప్రభుత్వం వారు చేపలు పోసిన మరియు సొసైటీ వారు చేపలు పోసిన ఉపాధి అవకాశాలు లేకుండా దళారుల కారణంగా మత్స్యకారుల జీవనం అగమ్య గోచారంగా తయారైనది. ఇదేమని అడిగితే భౌతిక దాడులు కూడా వెనకాడకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు, మత్స్యశాఖ అధికారులు ఎన్నికలు నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకొని మాకు జీవనోపాధి కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బుడిగం నాగేశ్వరరావు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, నాగటి చిన రాములు, గణపారపు నాగేశ్వరరావు, ఏట వెంకటప్పయ్య, బుడిగం ఉపేందర్, పిట్టల సతీష్, బుడిగం శ్రీను ఉపసర్పంచ్, మెరిగ ఎల్లయ్య, బుడిగం రాంబాబు, ఏరా నరేష్ తదితరులు పాల్గొన్నారు.