జనసముద్రం న్యూస్, కొయ్యలగూడెం మండల రిపోర్టర్, అక్టోబర్ 08;
ఏలూరు జిల్లా,
కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ రికార్డుల తారుమారుతో తమ బ్రతుకులు బజారున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న సాధనాల సుబ్బారావు సౌదామణి దంపతులు, చనిపోయిన వారి ఖాతా నెంబర్లతో పాస్ బుక్కుల మాయాజాలం. రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారులనే బురిడీ కొట్టించిన సాధారణ ఉద్యోగి, మానసికంగా ప్రశ్నించలేని, భౌతికంగా ఎదుర్కోలేని వ్యక్తులనే లక్ష్యంగా చేసుకొని రెవెన్యూ రికార్డుల తారుమారు.
మండల వ్యాప్తంగా భూదందాలకు, సెటిల్మెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ల్యాండ్ అక్రమార్కులు. డబ్బు పెడితే చాలు చనిపోయిన వాళ్ళను బ్రతికిస్తాo. రెవిన్యూ రికార్డులలో పుట్టిస్తాం. దేనికైనా ఒక రేటు ఉంటుంది, రేటు బట్టి రికార్డులలో చోటు ఉంటుంది, ఇదీ కొయ్యలగూడెం తహసీల్దారి కార్యాలయంలోని తీరు. అల్లుకుపోయిన అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారారు కొందరు వ్యక్తులు. ఈ విధంగానే రెవెన్యూ రికార్డుల తారుమారుతో తమ బ్రతుకులు బజారున పడ్డాయని ఏలూరు జిల్లా రా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సాధనాల సుబ్బారావు భార్య సౌదామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధ దంపతులు సోమవారం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డబ్బులకు ఆశపడిన తహసిల్దార్ కార్యాలయంలోని ఉద్యోగులు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారన్నారు. వాటిని అడ్డం పెట్టుకున్న వ్యక్తులు కిరాయి వ్యక్తులతో కలసి నాలుగు రోజుల క్రితం అక్రమంగా తమ పొలంలోకి ప్రవేశించి దౌర్జన్యం చేశారని అన్నారు. సుబ్బారావు దంపతులు దాదాపు నలభై సంవత్సరాలుగా సాగు చేస్తున్న 219/2, మరియు219/1 సర్వే నంబర్ కలిగిన 2.74 ఎకరాల భూమిని కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి ఒకరు పకడ్బందీగా పేర్లు మార్చి ఆన్లైన్ లో నమోదు చేశారన్నారు. రూల్స్ కి వ్యతిరేకంగా చనిపోయిన ముంగమూరి సూరయ్య ఖాతా నెంబర్ 145 తోనే యాదవోలకు చెందిన ఎం సూర్యరమేష్ కు ఆన్లైన్ చేశారని అదే భూమి మళ్లీ రాజవరం కి చెందిన పల్లంట్ల అరుణకు చెందిన భూమిగా ఆన్లైన్ చేశారన్నారు. ఖాతా నెంబర్ ఒక వ్యక్తికి కేటాయించిన తరవాత వేరొక వ్యక్తికి భూమి మార్పు చేస్తే ఖాతా నెంబర్ నంబర్ కూడా మారుతుంది. కానీ అటువంటిది ఏమీ లేకుండానే ఇద్దరు వ్యక్తులకు చనిపోయిన వ్యక్తికి చెందిన నెంబర్ తోనే ఆన్లైన్ చేయడం అన్యాయం, అవినీతి అన్నారు. రాజవరం గ్రామంలోనే మరొక చోట 378/2 హెచ్, 382/21, సర్వే నెంబర్ లోని 1.84 సెంట్లు భూమి కూడా తాము ముఫై సంవత్సరాల నుంచి సాగు సాగు చేస్తున్నామన్నారు. దానిని కూడా చీకట్ల పాటమ్మ (ఖాతా నెంబర్ 141) పేరిట సిహెచ్ గంగరాజుకు అనుకూలంగా ఉండేటట్లు అక్రమంగా ఆన్లైన్ నిర్వహించారని వృద్ధ దంపతులు వాపోయారు. ఇటీవల నిర్వహించిన జగనన్న రీసర్వే ఆర్వోఆర్ రికార్డ్స్ లలో రెండు చోట్ల సదరుభూమి మా ఆధీనంలోనే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారన్నారు. కానీ మండల రెవెన్యూ కార్యాలయంలోని ఉద్యోగులు మమ్మల్ని మోసం చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేరొకరికి ఇచ్చారన్నారు. కోట్ల రూపాయల విలువైన పొలం కావడంతో భూ కబ్జాదారుల కళ్ళు తమపై పడ్డాయి అన్నారు. మేము ఏమి చేయలేమనే ఉద్దేశంతో రాజవరం గ్రామానికి చెందిన వ్యక్తులు దందాలు నిర్వహిస్తూ ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఆవేదన చెందారు. రాజవరం పంచాయతీ పరిధిలో తమకు రెండు చోట్ల ఉన్న భూముల నుంచి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తుల నుంచి లక్షల రూపాయలలో ఒప్పందం కుదుర్చుకున్నారు అన్నారు. వారం రోజుల క్రితం తమ భూమి లోకి ప్రవేశించడమే కాక పొలంలో నుండి వృద్ధులమని కూడా చూడకుండా గెంటేశారన్నారు. సాటి రైతులు ఎదురు తిరిగి వాళ్లతో ఘర్షణ పడడంతో వెళ్లిపోయారని కానీ మళ్లీ వస్తాం మీ అంత చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు అన్నారు. తమ పిల్లలు ఎవరు మమ్మల్ని పట్టించుకోక ఉన్నారని అన్నారు. కౌలు మీద వచ్చే సొమ్ముతోనే బతుకుతున్నామన్నారు. కాగా మీడియా ద్వారా సమస్యను తహసిల్దార్ కే చెల్లన్న దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని వృద్ధ దంపతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వృద్ధులకు మద్దతుగా వామ పక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.