లక్కిరెడ్డిపల్లి రిపోర్టర్, రాయచోటి నియోజకవర్గం, జానసముద్రం న్యూస్ అక్టోబర్ 8
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి కస్తూరిరాజు గారి పల్లె లో ఉండే ఆకుల నాగార్జున డిగ్రీ చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రీడలపై మక్కువతో “ఖోఖో” ఆటలో ప్రావీణ్యం సంపాదించాడు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు దేవలంపల్లి ఎంపీపీ స్కూల్ లో, 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు దేవలంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ లక్కిరెడ్డిపల్లి జూనియర్ కళాశాలలో డిగ్రీ రాయచోటి లోని ఓ ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేశాడు. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విశేష ప్రతిభ ను చూపుతూ వస్తున్నాడు. ఇప్పటికే ఖోఖో సౌత్ జోన్ నేషనల్ లో ఆరు సార్లు ప్రతిభ చూపారు. తాజాగా న్యూ ఢిల్లీ లో జరిగిన యూత్ గేమ్ కౌన్సిల్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన “ఖోఖో” పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి 06.10.2024
జాయింట్ కమిషనర్ జీఎస్టీ చేతుల మీదుగా బెస్ట్ స్పోర్ట్స్ అవార్డు అందుకున్నారు. ఇంతటి ప్రతిభ కనబరుస్తున్న నాగార్జున ను పేదరికం వెక్కిరిస్తోంది. తల్లి పక్షవాతం తో మంచంలో ఉండగా తండ్రి కూలీకి వెళ్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నాగార్జున సోదరుడు లారీ కి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దేశ స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరుస్తున్న నాగార్జునకు ప్రభుత్వం అండగా నిలబడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.