తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన *అన్నమయ్య జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మద్దిరేవుల రామాంజనేయులు
సంబేపల్లి, జనసముద్రం దినపత్రిక అక్టోబర్ 8:-
అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామానికి చెందిన పలువురు వ్యవసాయ కూలీలు ఎస్. సోమవరం గ్రామంలో గుది సిద్దయ్య పొలంలో టమోటా పండ్లు కోయుటకు కూలి పనులకు వెళ్లడం జరిగింది. కాగా సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో భారీవీదురుగాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతూ…. ఎస్. సోమవరం గ్రామంలో పిడుగు పడడం జరిగింది. ఈ పిడుగుపాటుకు కూలి పనులకు వెళ్లిన దిగువ హరిజనవాడకు చెందిన శెట్టిపల్లి మల్లీశ్వరమ్మ (43), శెట్టిపల్లి శంకరమ్మ (40) ఈ ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా శెట్టిపల్లె కార్తీక్, శెట్టిపల్లె రెడ్డమ్మ, శెట్టిపల్లె మంగమ్మ, శెట్టిపల్లి జయమ్మ, శెట్టిపల్లి అమర్నాథ్ ఈ ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందజేయడం జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి యనమల విశ్వనాథ్, గంట వెంకటకృష్ణ, పాలన్న గారి పల్లి లవ కుమార్, భాను , పాత్రికేయులు, కుటుంబ సభ్యులు