అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ అక్టోబర్ 8 జన సముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గంలో.. రాజంపేట డివిజన్ ట్రెజరీ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తూ చోరీకి పాల్పడిన వెంకాల విష్ణువర్థన్ రెడ్డిని (32) అరెస్టు చేసినట్లు
రాజంపేట డి.ఎస్పీ సుధాకర్ తెలిపారు. సోమవారం అర్బన్ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి.ఎస్పీ మాట్లాడుతూ విష్ణువర్థన్ రెడ్డి ని
సబ్ ట్రెజరీ ఆఫీసర్ పి రమేష్ రెడ్డి, సీనియర్ అకౌంటెంట్ సాదక్ బాష లు అవమా నకరంగా తక్కువ చేసి మాట్లాడుతుండడంతో మనస్థాపం చెందారన్నారు. తనను మనస్థాపానికి గురి చేస్తున్న రమేష్ రెడ్డిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతో స్ర్టాంగ్ రూములో వున్న ఏదైనా వస్తువులు దొంగలిస్తే ఎస్.టి.ఓ పై చర్యలు వుంటాయని భావించారన్నారు. ఇందులో భాగంగా గత నెల 13వ తేదీన మధ్యాహ్నానం సమయంలో ఎస్.టి.ఓ, ఏ.టి.ఓ లు స్ర్టాంగ్ రూమ్ తాళాలు తెరిచి వున్నసమయంలో స్ర్టాంగ్ రూమ్ లోకి వెళ్లి చెక్క బీరువాలో వున్న రూ.12 వేలు నగదు, సీల్ చేసి అట్టపెట్టెలో వున్న 20.800 గ్రాముల బంగారు నాణేములను చోరీ చేసి ఇంట్లో దాచుకు న్నారన్నారు. గత నెల 21వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు వారి వద్ద దాచిన రూ.12 వేలు తిరిగి ఇవ్వమని సీనియర్ అకౌంటెంట్ సాదక్ బాష ను అడగడంతో దొంగతనం విషయం బయట పడిందన్నారు. ఈ విషయమై జిల్లా ట్రెజరీ మరియు అకౌంట్స్ ఆఫీసర్ సయ్యద్ మహబూబ్ సెప్టెంబరు 30వ తేదీన అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు తన ఆధ్వర్యంలో సి.ఐ కె యల్లమరాజు, ఎస్.ఐలు వి నాగేశ్వరరావు, వి. లక్ష్మి ప్రసాద్ రెడ్డి లు తమ సిబ్బందితో ఒక టీంగా ఏర్పాటు చేసి డ్యూటీకి గైర్హాజరు అవుతున్న అనుమానాస్పద ముద్దాయి అయిన అటెండర్ విష్ణువర్థన్ రెడ్డి పై నిఘా వుంచి సోమవారం ఉదయం 8 గంటల సమయంలో రాజంపేట పట్టణంలోని కొత్త బస్టాండు వద్ద వున్న కడప -రాజంపేట మెయిన్ రోడ్డు పైన అరెస్టు చేశామన్నారు. కడప నగరం ఎర్రముక్కపల్లెలో నివాసం వుంటున్న విష్ణువర్థన్ రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడిన 78 ఓల్డ్ కాయిన్స్, ఒక జత పోగులు (చెవి రింగులు), రెండు కొక్కిలు, డైమండ్ షఫర్ స్వార్స్ 9, మొర్రగుండ్లు 4, మొత్తం బరువు 20.800 గ్రాములు అన్నారు. అలాగే రూ.12 వేలు తన స్వంత ఖర్చుకు వాడుకున్నట్లు విచారణలో అంగీకరించా రన్నారు. ఈ కేసును త్వరితగతిన చేధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారన్నారు.
ఈ కార్యక్రమంలో… ASi వర్మ, పోలీసులు పాల్గొన్నారు.