జనసముద్రం న్యూస్ అక్టోబర్ 06, యాదాద్రి భువనగిరి జిల్లా:
కేంద్రంలో భువనగిరి పట్టణంలోని స్థానిక వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల స్వాగత వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య జూనియర్ కళాశాల చైర్మన్ గడ్డం శ్రీనివాస్, వైస్ చైర్మన్ బచ్చు రాజేశ్వర్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా కీలకమైందని ఈ దశలోనే విద్యార్థులు ఉన్నత పౌరులుగా ఎదగాలని అన్నారు. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మీ లక్ష్యాలను సాధించినప్పుడే జీవితం సార్థకం అవుతుందని ప్రతి విద్యార్థి వారి యొక్క లక్ష్యాలను ఎంచుకొని నెరవేర్చుకోవాలని తద్వారా ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు.
ప్రిన్సిపల్ ఆంబోజు మల్లేష్ మాట్లాడుతూ శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించారని ప్రతి సంవత్సరం రాష్ట్ర ర్యాంకులు సాధించడంలో మా శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమమునకు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల చైర్మన్ గడ్డం శ్రీనివాస్, వైస్ చైర్మన్ బచ్చు రాజేశ్వర్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ తో పాటు ప్రిన్సిపల్ అంబోజు మల్లేష్, డైరెక్టర్ యంపల్ల కొండల్ రెడ్డ, కొరటికంటి శ్రీధర్ అధ్యాపకులు సదానందం, శ్రీకాంత్, రాము, శైలేష్ , మురళీ, రఫీ, శ్రీలత, పసల బాలరాజ్, చైతన్య, భవిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విద్యార్థుల ఆటపాటలతో రోజంతా ఉత్సాహంగా గడిపారు.