మాచర్ల జన సముద్రం న్యూస్ అక్టోబర్ 06.
రీడ్స్ స్వచ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో * మీకు తెలుసా” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో రీడ్స్ స్వచ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో ” మీకు తెలుసా? కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన సదస్సులో భాగంగా మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాచర్ల I C TC కౌన్సిలర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ.. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ లక్షణాలు, అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, మీ ద్వారా తెలియని వాళ్లకు తెలియజేయమని చెప్పడం జరిగింది .డాక్టర్స్ సురేష్ , జయప్రకాశ్ , దినేష్ , వంశీ , స్టాఫ్ నర్స్ రాణి , భార్గవ్, మార్క్ , ధనలక్ష్మి ,రీడ్స్ స్టాఫ్ ఔట్రీచ్ వర్కర్ మౌలాబీ ,పీర్ ఏడ్యూకేటర్ మస్తానుబి Y R G ( C C F) ధమయంతి పాల్గొన్నారు.