జనసముద్రం న్యూస్, రాప్తాడు మండలం, అక్టోబర్ 06:
రాప్తాడు మండలం తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రసన్నాయ పల్లి ప్రవీణ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు వినోద్ కుమార్, తలారి శివ, కరె మురళి, ఉజ్జనేశ్వర్,మోహన్ శనివారం రాప్తాడు మండలంలో నూతన ఎంపీడీవో గా పదవి బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో బుల్లె విజయలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందచేసి నూతన ప్రభుత్వం లో ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అయ్యేలా కృషి చేయాలని కోరారు.