ఒకే ఇంటి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక
నాడు ప్రజాసేవకై అమ్మ.. నాన్న జూలకంటి నాగిరెడ్డి, దుర్గాంబ, నేడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి
జనసముద్రంన్యూస్, అక్టోబర్ 2, పల్నాడు జిల్లా,మాచర్ల .
బ్రహ్మనాయుడు ఏలిన పల్నాడు ప్రాంత రాజకీయలలో జూలకంటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పవచ్చు. పల్నాడు ప్రాంతంలో జూలకంటి కుటుంబం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు జూలకంటి. నాగిరెడ్డి. పల్నాడు ప్రజలు నాగిరెడ్డిని పల్నాటి బాలచంద్రుడిగా పిలుచుకుంటూ ఉంటారని పెద్దలు చెప్తుంటారు. సహజంగా ఒక ఇంట్లో ఒకరు ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడం గొప్ప విషయం అలాంటిది పల్నాడు చరిత్రలో ఒకే ఇంటి నుండి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడం గొప్ప వరమని చెప్పవచ్చు. 1967 నుంచి జూలకంటి కుటుంబం రాజకీయలలో తనదైన ముద్ర వేస్తూ వచ్చింది. పల్నాడులో కీలకమైన మాచర్ల, గురజాల నియోజకవర్గలలో శాసనసభ్యులుగా పనిచేసే అవకాశం ఆ కుటుంబానికే దక్కిందని చెప్పవచ్చు. నాడు అమ్మ జూలకంటి. దుర్గంబ , నాన్న జూలకంటి. నాగిరెడ్డి నేడు తనయుడు జూలకంటి. బ్రహ్మానందరెడ్డి జూలకంటి కుటుంబ నేపథ్యం ఇది. ప్రస్తుత మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి. బ్రాహ్మనందరెడ్డి తండ్రి జూలకంటి. నాగిరెడ్డికి పల్నాడు ప్రాంతంలో ఎంతో మంచి పేరు ఉంది. ఆయనను పల్నాడు ప్రాంత వసులు ముద్దుగా పల్నాటి బాలచంద్రుడు, పల్నాటి పులి గా అభివర్నిస్తారు. పల్నాడు జిల్లా వెల్దుర్తికి చెందిన జూలకంటి. నాగిరెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారు. అయన సొంత ఊరు వెల్దుర్తి కావడంతో సొంత ఊరు నుండే రాజకీయన్ని మొదలుపెట్టారు. ప్రజలకు దెగ్గరగా ఉంటూ నిజాయితీతో పనిచేసారని ఇప్పటికి అయన గురించి నిత్యం ప్రజలు చెప్పుకోవడం విశేషం. ప్రజలకు అందుబాటులో ఉంటూ పేదప్రజలకు సహాయం చేయడంలో జూలకంటి . నాగిరెడ్డి పల్నాడు ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మాచర్ల నియోజకవర్గంలో ఆ రోజులలో జూలకంటి. నాగిరెడ్డి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికి అలాంటి సమయంలోనే నాగిరెడ్డి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అవినీతి మారక లేని జూలకంటి. నాగిరెడ్డిని గుర్తించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి. తారకరామారావు 1983లో జూలకంటి. నాగిరెడ్డికి టీడీపీ తరపున గురజాల నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం కల్పించగా జూలకంటి. నాగిరెడ్డి టీడీపీ నుండి విజయం సాధించారు. జూలకంటి కుటుంబం దీర్ఘకాలం నుండి పల్నాడు రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించింది. ఆ తరువాత 1999 లో జూలకంటి. బ్రహ్మానందరెడ్డి తల్లి జూలకంటి. దుర్గంబ మాచర్ల టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి. లక్ష్మరెడ్డి పై 1951 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా 2024 ఎన్నికలలో జూలకంటి. కుటుంబం నుండి తెలుగుదేశం టికెట్ దక్కించుకున్న జూలకంటి. బ్రహ్మానందరెడ్డి సమీప వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి పై 33,318 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పల్నాడు రాజకీయ చరిత్రలో జూలకంటి కుటుంబానికి ప్రత్యేక విశిష్టత లభించింది. జూలకంటి కుటుంబం నుంచి ఒకే ఇంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. దీనితో పల్నాడు ప్రజలు నాడు ప్రజాసేవకై అమ్మ.. నాన్న… నేడు బ్రహ్మానందరెడ్డి అని పల్నాడు ప్రజలు భావిస్తున్నారు.