-సమాజ సేవలో నిరంతరం ముందుంటాం : సమితి సభ్యులు
కడప జనసముద్రం దినపత్రిక అక్టోబర్, 2
కడప: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ సూచనల మేరకు కడప కేంద్ర కారాగారంలో ఖైదీలుగా ఉన్న వారికి సౌకర్యార్థం కేంద్ర కారాగార అధికారులు సమితి అధ్యక్షులను సంప్రదించగా మానవతా థృక్పథ్యంతో కడప కేంద్ర కారాగారంలోని ఖైదీలకు సౌకర్యంగా వాటర్ బాటిల్స్ ను సమితి సభ్యుల ఆధ్వర్యంలో కారాగార అధికారి రామకృష్ణకు అందించారు. నాడు వైసీపీ రాక్షస పాలనలో మోసపోయిన ఓ మైనారిటీ కుటుంబాన్ని సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ ఓదార్చి, ధైర్యం చెప్పడానికి కడప జిల్లా వస్తున్నప్పుడు అన్యాయంగా అడ్డగించి, తప్పుడు కేసులు బనాయించి కడప కేంద్ర కారాగారంలో వేయడం జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సమితి అధ్యక్షులు షుబ్లీ కారాగారంలో ఖైదీలు పడుతున్న అవస్థలు, కష్టాలు కళ్ళారా చూసి ఖైదీలకు సాంధ్యరభానుసారంగా రంజాన్ నెల సందర్భంగా పండ్లు, ఫలహారాలు, అలాగే ఖైదీలకు మానసికంగా, అధ్యాత్మికంగా ధైర్యంగా ఉండేందుకు ధార్మిక గురువులతో ఉపన్యాస కార్యక్రమలను చేపట్టడం, ఖైదీలు చెల్లించాల్సిన జరిమానలాను సైతం సమితి తరపున చెల్లించడం జరుతోందని సమితి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర కారాగార అధికారులు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న సేవలు అభినందనీయమని, మొన్న విజయవాడలో వరదల సమయంలో సమితి సేవలు అమూల్యమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కడప కేంద్ర కారాగార అధికారి రామకృష్ణతో పాటు సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇఫ్తేకార్ జమాల్, రుబీనా, అన్వర్, సిద్దిఖ్, ఇర్షాద్, బాబ్జీ, నిజాం పాల్గొన్నారు.