డెంగ్యూ చికిత్స@ 1,50,000.

Spread the love

– ఏజన్సీలో రాజ్యమేలుతున్న ప్రైవేట్ వైద్యులు

  • సొంత ఆసుపత్రులకే ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వ వైద్యులు

జన సముద్రం న్యూస్, అక్టోబర్ 02 (భద్రాచలం) :

ఏజన్సీ ప్రాంతమైన భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్
సెంటర్ సమీపంలో గల ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో తెలిసిన వ్యక్తి వైద్యం పొందుతుంటే పరామర్శించేందుకు ఓ
వ్యక్తి వెళ్ళగా… అక్కడ మరో తెలిసిన వ్యక్తి తారసపడ్డాడు. ఎవరికి బాగాలేదని విచారించగా నా భార్యకు డెంగ్యూ
జ్వరం వచ్చింది… ఈ ఆసుపత్రిలో చేర్పించానని చెప్పాడు. గతంలో నాకు దెంగ్యూ రాగా ఇదే ఆసుపత్రిలో చికిత్స
తీసుకున్నానని, నయమైందని… సుమారు లక్షా యాభైవేల రూపాయల వరకు ఖర్చనట్లు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ నా
భార్యకు సైతం డెంగ్యూ వచ్చిందని సెలవిచ్చాడు. ఒక ఏడాది ఒక పేద కుటుంబంలో ఇరువురు వ్యక్తులకు దెంగ్యూ
జ్వరం రావడం వలన సుమారు మూడు లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
డెంగ్యూ జ్వరం వచ్చి పరిస్థితి విషమించడంలో పేద ప్రజలు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం లేక ప్రైవేట్ ఆసుపత్రులను
ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా సదరు ప్రైవేట్ వైద్యులు పరీక్షలు, మందులు, వైద్య చికిత్స పేరుతో పేదలను
జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. కార్పోరేట్ సంస్థలు ప్రతి వస్తువుని దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి, పట్టణాలు,
పల్లెలకు సైతం చేరవేస్తున్నాయి. కానీ ప్రభుత్వ వైద్యం మాత్రం పల్లెలకు చేరడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి
సైతం పేద ప్రజలు ప్రాణాల మీద భయంతో మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వచ్చి ప్రైవేట్ కోరల్లో చిక్కుకుంటున్నారు.
జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన తరువాతనే వెంగ్యూ నిర్ధారణ చేయాలని
జిల్లా వైద్యాధికారి ఆదేశించినా, ఆ దిశగా భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలోని వైద్యులు చర్యలు తీసుకోకపోవడం
విచారకరం. ఎక్కడిక్కడ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షల పేరుతో నిలుపుదోపిడీ చేస్తున్నారు. మరోపక్క
భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత కొంతమేర ఉందన్న విషయం వాస్తవమే కానీ ఏరియా
ఆసుపత్రిలో ప్రస్తుతం విధులు నిర్వహించే వైద్యులైనా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా, అంతకరణ శుద్ధిదో
సేవలందిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కొందరు వైద్యులు ఓవి సమయంలోనే
ఎవరికి సంబంధించిన రోగులను ఆయా విభాగాల వైద్యులు వారి వారి సొంత ఆసుపత్రులకు తరలిస్తూ ఆయా రోగులకు ఆపరేషన్లు, ఇతర మేజర్ చికిత్సలు అందిస్తున్నారు. ఇక్కడ చికిత్స చేయాలంటే పలు నిబంధనలుంటాయంటూ
వారిని ప్రలోబాలకు గురి చేసి తమ సొంత అసుపత్రుల తరలిస్తున్నారు. ఇది అందరికీ తెలిసినా ఎవరూ దీనిని
ప్రశ్నించే సాహసం చేయరు. మరోపక్క సదరు వైద్యులు బయట కార్పోరేట్ ఆసుపత్రులకు వెళితే ఇంకా ఎక్కువ
ఖర్చవుతుంది. మన అసుపత్రి కాబట్టే తక్కువ ఖర్చులో మీ రోగం నయం చేశామని రోగికి బ్రెయిన్ వాష్ చేసి వారిని
తమ ఆస్థాన పేషెంట్లుగా మార్చుకుంటున్నారు. ప్రైవేట్ వైద్యులు రోగికి కల్పిస్తున్న భరోసా… ప్రభుత్వ వైద్యులు ఎందుకు
కల్పించలేక పోతున్నారనేది ప్రశ్నార్థకం. మాకు పథకాల కంటే ఆరోగ్యం ముఖ్యమని ఉచిత ఆరోగ్యం, ఉచిత విద్య అందిస్తే చాలని పేద ప్రజలు ప్రభుత్వాలకి, పాలకులకు విన్నవించుకుంటున్నారు. కేవలం విద్య, వైద్యం కోసమే పేద ప్రజలు తరతరాలుగా అభివృద్ధి చెందాలని ప్రయత్నిస్తున్నా అది కలగానే మిగులుతుంది. అనారోగ్యం సోకినప్పుదల్లా
ప్రాణ భయంతో లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వైద్యం చేయించుకుని, తిరిగి ఆ అప్పులు చెల్లించేందుకే పేదల జీవితాలు మగ్గిపోతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలో లేని వసతులు సైతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో కల్పిస్తూ ఆరోగ్యశ్రీ
తదితర సౌకర్యాలను ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు యదేచ్చగా వినియోగించుకుంటున్నాయి. ప్రభుత్వ
ఆసుపత్రుల్లోనే ఆయా వసతులను కల్పించి, వైద్యులు, సిబ్బందిని నియమిస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ రూపాన
ప్రభుత్వ ధనాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు,
ఉన్నతాధికారులు ప్రభుత్వ వైద్యశాలల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, ఈ ప్రైవేట్ ఆసుపత్రుల
కబంధ హస్తాల నుంచి అమాయక ఆదివాసీలు, పేద ప్రజలకు విముక్తి కల్పించాలని ఏజన్సీ ప్రాంత ప్రజలు, బాధిత
రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

  • Related Posts

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    Spread the love

    Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    Spread the love

    Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు