-48 గంటల్లోనే నిందితుల వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి గిరిబాబు
జనసముద్రం అక్టోబర్ 02: డిండి :-
నల్లగొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి గ్రామ శివారులోని చెట్ల పొదల్లో శనివారం జరిగినటువంటి యువకుడి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే.మంగళవారం విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి గిరిబాబు తెలిపిన వివరాల ప్రకారం కేతేపల్లి మండలం,కొప్పోలు గ్రామానికి చెందిన శ్రీపతి జగదీష్ (35) ను ఎలాంటి ఆధారాలు లేకుండా హత్య గావించబడ్డ వ్యక్తి యొక్క కేసును సీఐ సురేష్,ఎస్సై రాజు, సిబ్బంది, చందంపేట,నేరేడుగొమ్ము ఎస్సై,లు,డాగ్ స్క్వాడ్ సహాయంతో 48 గంటలలో కేసు యొక్క నిందితులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మృతుని భార్య రమాదేవి, సడ్డకుడు కొంకి పెద్దయ్య, పెద్దయ్య భార్య నిర్మల,పెద్దయ్య కుమారులు మధు,అరవింద్ లు గల ఐదుగురు నిందితులు కలిసి జగదీష్ ను బండరాయితో కొట్టి చంపడం జరిగిందని తెలిపారు.
జగదీష్ సడ్డకుని కూతురు మైనరును హైదరాబాదులో గత ఆరు నెలల క్రితం మాయ మాటలు చెప్పి లోబర్చుకోవడం జరిగింది.ఈ విషయంలో జగదీష్ కిడ్నాప్ కేసు, జైలు జీవితాన్ని అనుభవించి బయటకు వచ్చి మైనర్ బాలికను మళ్లీ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.ఇతని ప్రవర్తనతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించిన అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. కోపం పెంచుకున్న నిందితులు ఎలాగైనా జగదీష్ ను అంతమొందించాలని ప్లాన్ ప్రకారం శనివారం ఉదయం అల్వాల్ లో నివసిస్తున్న జగదీష్ ఇంటికి కారులో చేరుకున్న నిందితులు ఇంటి యజమాని సహాయంతో జగదీష్ ను నిద్రలేపడం జరిగింది.అతన్ని కారులో బలవంతంగా ఎక్కించుకొని వెంట తెచ్చుకున్న తాళ్ల సాయంతో కాళ్లు చేతులు కట్టి,నోటికి అడ్డంగా చున్ని ని చుట్టి చెరుకుపల్లి శివారులో చెట్ల పొదల్లో జగదీష్ తలపై బండరాయి వేయడంతో చనిపోవడం జరిగిందని నిర్ధారించుకొని,మృతుని ఫోన్లను దాచిపెట్టడం జరిగింది.హత్య కేసులో 5 గురు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సురేష్,ఎస్సై రాజు,సిబ్బంది హుస్సేన్, తిరుపతయ్య,సైదమ్మ,గణేష్ లను జిల్లా ఎస్పీ అభినందించడం జరిగిందని,వీరికి త్వరలో రివార్డ్స్ ను కూడా అందజేయడం జరుగుతుందని డి.ఎస్.పి తెలిపారు.