గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్.
జన సముద్రంసెప్టెంబర్ 28 బ్యూరో చీఫ్ టి. జి ,&ఎ.పి.
హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలలో అంతంత మాత్రం గా వివిధ వృత్తులలోకుటుంబ పోషణ చేసుకుంటున్న బ్రాహ్మణ సమాజం వారు అధిక శాతం మంది అద్దె ఇళ్లలోనే కాలక్షేపం చేస్తుంటారు. తాము నివాసం ఉంటున్న ఇళ్లలో కార్యక్రమాలు చేసుకునే వసతులు లేక ఇతర బ్రాహ్మణుల ఇళ్లలో పితృ కార్యాలు, ఆబ్దికాలు , మాసికాలు ఈ విధంగా ఇతర కార్యక్రమాలు తక్కువ ఖర్చుతో చేసుకుంటూ ఉంటారు.
వారాసిగూడ ప్రాంతంలో ఇందిరా నగర్ లో తక్కువ ఖర్చుతో బ్రాహ్మణులకార్యక్రమాలు చేయించే కుంచేటి. ప్రసాద్ శర్మ ఇంటిపై ఆ ప్రాంతానికి చెందిన సంఘ వ్యతిరేక శక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామా వజ్జల. రవికుమార్ శర్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలకుర్తి వెంకటరమణ శర్మ, భాగవతుల ప్రసాద్ శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పురాణం.రామప్ప శాస్త్రి,రాష్ట్ర ప్రచార కార్యదర్శి బుక్కపట్నం. రామాచార్యులు తెలిపారు.
మహాలయ పితృపక్షాలు జరుగుతున్న ఈ సమయంలో తక్కువ ఖర్చుతో అనేకమంది బ్రాహ్మణ సోదరులకు తమ ఇంటి వద్ద కార్యక్రమం చేసుకునే అవకాశం కల్పిస్తున్న ప్రసాద శర్మ పై దాడి చేసి తప్పుడు కేసు బనాయిచడాన్ని కూడా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవికుమార్ శర్మ విజ్ఞప్తి చేశారు.