కూకట్ పల్లి ప్రతినిధి జనసముద్రం (సెప్టెంబర్:28)
రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. బంజారాహిల్స్ లో ఉప ముఖ్యమంత్రి నివాసంలో చోరీకి పాల్పడిన దుండగులు పలు వస్తువులు ఎత్తికెళ్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితులు బిహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఘటనకు సంబధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.