జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్28:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గల శుక్రవారం వారసంతలో అక్రమంగా గోవధకు తరలిస్తున్న గోవులను హుస్నాబాద్ బిజెపి మండల శాఖ అధ్యక్షుడు వెల్దండి రాజేంద్రప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సంపత్ నాయక్,మండల సోషల్ మీడియా కన్వీనర్ నార్లపురం సత్యం, అక్కన్నపేట మండల బిజెపి అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి,అక్కన్నపేట మండలం ప్రధాన కార్యదర్శి సలేంద్ర తిరుపతి, ఎస్టి మోర్చా నాయకులు మోహన్ నాయక్ తదితరులు కార్యకర్తలు వెంటనే స్పందించి గోవధకు తీసుకు వెళుతున్న గోవులను అడ్డుకొని సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో గల శ్రీ రామదాసు చారిట్రబుల్ ట్రస్ట్ గోశాలకు తరలించారు.