ప్లాస్టిక్ కవర్లను నిషేధించి జ్యూట్ బ్యాగులు వాడాలి

Spread the love

పురపాలక సంఘ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న

జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్ 28:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా సైక్లతాన్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థినులు వారి యొక్క సైకిళ్లతో పురపాలక సంఘ కార్యాలయం నుండి గాంధీ చౌరస్తా వరకు సైకిల్స్ మీద ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహం చుట్టూ మానవహారంలా ఏర్పడి స్వచ్ఛతపై, పర్యావరణంపై, చెత్త విభజనపై, ప్లాస్టిక్ నిషేధంపై డ్రాయింగ్ గీసిన చార్జ్ ను ప్రదర్శిస్తూ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్లాస్టిక్ కవర్లు నిషేధించి జ్యూట్ బ్యాగులను వాడాలని, చెత్తను తడి చెత్త పొడి చెత్త మరియు హానికరమైన చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతలో ముందు ఉంచాలని, హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ హుస్నాబాద్ పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజలందరి భాగస్వామ్యం కావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ , కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, బొజ్జ హరీష్, పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్లు, వార్డ్ ఆర్పి,జవాన్లు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!