జనసముద్రం న్యూస్ కారంపూడి సెప్టెంబర్ 25
మాచర్ల నియోజకవర్గంలో సంబంధించిన ఆటల పోటీలు కారంపూడి మండలంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ లో మంగళవారం నిర్వహించారు. అందులో భాగంగా అండర్ 14, అండర్ 17 ల బాలికల విభాగం నందు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్. అశ్విని జిల్లా స్థాయికి ఎంపికైనట్లు కరస్పాండెంట్ అనిల్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా స్కూల్ కూ చెందిన విద్యార్థి జిల్లా స్థాయికి ఎంపిక అవడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన తెలిపారు. ప్రిన్సిపల్ బినోమా , పిటి మాస్టర్ నేనావత్ శివ కృష్ణ, మరియు స్కూల్ టీచర్లు సిబ్బంది ఆ విద్యార్థికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల
Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…