పెద్దమనుషుల సమక్షంలో సద్దుమణిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి.
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 25సెప్టెంబర్
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం లో గల ప్రముఖ వ్యాపార కేంద్రం జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ వివాహిత మహిళను లైంగికంగా వేధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లైంగిక వేధింపుల విషయాన్ని తన భర్తకు తెలియజేయడం జరిగింది.
ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత మహిళకు ఫోన్ చేయడం, (చరవాణి)లో ఛాటింగ్ చేస్తూ వేధింపులకు గురి చేయడంతో డయల్ 100 కు ఫోన్ చేయడం జరిగింది.
హుటాహుటిన బ్లూ కోట్ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి జరిగిన సమాచారాన్ని సేకరించుకున్నారు. జమ్మికుంట (టౌన్) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.
జమ్మికుంట (టౌన్) సి.ఐ.వరంగంటి రవి ఫిర్యాదు వివాహిత మహిళ నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
జమ్మికుంట పట్టణంలోని స్థానికంగా ఉంటున్న పెద్ద మనుషుల సమక్షంలో విషయాన్ని గోప్యంగా ఉంచి సద్దుమణిగేలా చేయడం జరిగింది. రాతపూర్వకంగా జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందజేసినప్పటికినీ ప్రభుత్వ ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులను రహస్యంగా ఉంచడంతో ఫిర్యాదు అందిందా లేదా అనే విషయం పై జమ్మికుంట (టౌన్) లో గుసగుసలు మొదలయ్యాయి.