వెల్డండ,సెప్టెంబర్,24(జనసముద్రం న్యూస్)
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డులో కల్తీ నెయ్యిని వాడి శ్రీవారికి నివేదించే పవిత్ర లడ్డూను కల్తీ లడ్డుగా చేసిన పాలకులను పాలుపంచుకున్న దొంగలను వెంటనే శిక్షించాలని ఈ కల్తీ నెయ్యిలోపాలుపంచుకున్న ఎంత స్థాయి వారిని అయినా ఉరి తీయాలని వెల్డండ పోలీస్ స్టేషన్లో మరియు స్థానిక ఎమ్మార్వో ని కురుమిద్దె యాదగిరి ఫిర్యాదు ఇచ్చి కోరారు,యాదగిరి మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రం,శ్రీ నారాయణుని నిలయం దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎవరైతే ఈ అపచారానికి పాల్పడ్డరో వారిని కఠినంగా శిక్ష విధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీధర్,విష్ణు,రమేష్, రామకృష్ణ,గెలవయ్య, పాండు,వెంకటేష్,శ్రీనివాసరెడ్డి, దేవేందర్ రెడ్డి, ఆనందు,అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు