అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..
సెప్టెంబర్ 24,జనసముద్రంన్యూస్:
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని, యాదాద్రి భువనగిరి,మల్కాజిగిరి జోన్ లలో రాత్రి సమయంలో ఎలక్ట్రికల్ పోల్స్ నుండి అల్యూమినియం విద్యుత్ వైర్లు,ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి తీగల చోరీ కి పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల
అంతర్రాష్ట్ర ముఠాను వలపన్ని పట్టుకున్న బొమ్మల రామారం పోలీసులు.పట్టుబడిన అంతరాష్ట్ర ముఠా సభ్యులు బిక్రం కుమార్ సింగ్,మహేందర్ రాం,రాం కుమార్ సింగ్,గోవింద్ మండల్,శ్రావణ్ మహేతో,ప్రదీప్ కుమార్ మిశ్రా,రాజ్ కుమార్ రాయ్ అనే ఎనిమిది మంది సభ్యుల ముఠా తెల్లవారు జామున రామస్వామి తండా సమీపంలో విద్యుత్ సంబాల అల్యూమినియం వైర్ల చొరీకి పాల్పడుతుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు,పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా గతంలో 46 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.పట్టుబడిన నిందితుల నుండి 2 లక్షల 73 వేల నగదు, ఓ ఎర్టీగా కారు, ఓ ట్రాలి ఆటో, మారుతీ ఎక్సెల్-6వాహనం,200 ల కిలోల రాగితీగ,8 మొబైల్ ఫోన్స్,చోరీలకు పాల్పడిన పరికరాలు స్వాదీనం చేసుకున్నట్లు,స్వాదీనం చేసుకున్న మొత్తం విలువ సుమారు 35 లక్షల వరకు ఉంటుందని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో తెలియజేశారు.గత రెండేళ్లుగా పోలీసుల కన్నుగప్పి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను వలపన్ని,చాకచక్యంగా పట్టుకున్న బొమ్మల రామారం ఎస్సై శ్రీశైలం, రూలర్ సీఐ ప్రభాకర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్,కానిస్టేబుల్ రాజు,మెహబూబ్ లను డీసీపీ అభినందించారు.