పుల్లంపేట మండలన్ని అభివృద్ధి చేస్తానంటున్న…. ముక్కా రూపానందరెడ్డి,, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్.
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 24జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం టౌన్ లో నేడు సోమవారం మూడవ రోజు ” ఇది మంచి ప్రభుత్వం ” అనే కార్యక్రమానికి అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి , ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లు పాల్గొని టీడీపీ పార్టీ స్థాపీకుడు స్వర్గీయ నందమూరి తారక రామరావు చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతు.. పుల్లంపేట మండల ప్రజలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గెలుపుకు ఎంతగానో కృషి చేసినందుకు ధన్యవాదములు తెలిపారు.అలాగే పుల్లంపేట పంచాయతీ లో బైపాస్ మరియు టౌన్ లో RTC బస్సు సెల్టార్ లు,, రోడ్ వెడల్పు చేసి సీసీ రోడ్లు,,నూతన శితరాంపేట బ్రిడ్జి,, డిగ్రీ కళాశాల,, మురికి కాలువను శుభ్రం చేసి పంటకాలువలకు నీళ్లు ఇచ్చే విధంగా తయారు చేస్తానని నిండు సభలో హామీ ఇచ్చారు.
టీడీపీ పార్టీ ప్రభుత్వం చేసిన మంచి ప్రజలకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడమే కాక వారి
సమస్యలు విని పరిష్కరించేందుకు ప్రజా వేదికగా దోహదపడుతుందన్నారు.రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ మాట్లాడుతు.. వంద రోజుల్లో ప్రభుత్వం చేసిన పథకాలు వివరిస్తూ, ప్రజల దగ్గర అర్జీలు తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి, కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది మరియు పుల్లంపేట మండలలోని వెలుగు డిపార్ట్మెంట్లో
టి బలిజపల్లి అరుంధతి వాడకు చెందిన ఇందుకూరి మణెమ్మ వి.వో.ఏ. గా పనిచేసి ఆకస్మిక మరణం చెందడం వల్ల తోటి వి.వో. ఏ లు అందరూ తన వంతు సహాయంగా దాదాపు 90,000 చెక్కును ఇన్చార్జి,ఎమ్మెల్యే, యువ నాయకుడు,, ముక్కా వికాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
అందులకు ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి వారి అందరిని అభినందిస్తూ తన వంతు సహాయంగా 50,000 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేస్తానని ప్రకటిస్తూ, వారి యొక్క కుటుంబానికి అండగా నిలిచి, తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో… డేర్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ ముక్కా సాయి వికాష్ రెడ్డి,, యస్ఐ మోహనకుమార్ గౌడ్,, ప్రభుత్వ అధికారులు, ప్రజలు, ఎన్డీఏ కొట్టుమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.