జనసముద్రం సెప్టెంబర్ 24: డిండి:-
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు సోమవారం అచ్చంపేట మండలం పరిధిలోని హాజిపూర్ లో గల వన నర్సరీ లో మిర్చి టమాటో వంకాయ పెంపకం పై వృత్తివిద్యా అధ్యాపకులు బయ్య సందీప్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. పంటలను ఎలా పండిస్తారు అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.ఇలాంటి వృత్తి విద్య కోర్సుని అందించిన సర్వ శిక్ష అభియాన్ మరియు స్కిల్ ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ వారికి విద్యార్థులు తమ కృతజ్ఞతలు తెలిపారు.ఈ పరిశీలనలో ఉపాధ్యాయులు విజయ్, చెన్నయ్య,విద్యార్థులు పాల్గొన్నారు.