యాదాద్రి భువనగిరి జన సముద్రం జిల్లా ప్రతినిధి:–
యాదాద్రి జిల్లా: సెప్టెంబర్20
యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం వచ్చిం ది. శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేం దుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి.. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు.
కాగా,బుధవారం సాయంత్రం కొండకింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.
ఈ సందర్భంగా స్వామివారి హుండీఆదాయంరూ.2,98, 48,233లు వచ్చినట్లు చెప్పారు.శ్రీ స్వామి వారి హుండీలో మిశ్రమ బంగార ము- 205 గ్రాములు, మిశ్ర మవెండి – 5.710గ్రాము లు, అమెరికా – 1261 డాలర్లు, ఆస్ట్రేలియా 125 డాలర్లు, ఇంగ్లాండ్ – 65 పౌండ్స్, యూఏఈ – 210
నేపాల్ – 730 రుపిస్, సౌదీ అరేబియన్ – 537 రియల్, సింగపూర్ – 60 డాలర్స్, కతర్ – 3 రియల్, ఒమన్ – 100 బైస, శ్రీలంక – 1000 రూపీస్, కెనడా – 60 డాలర్స్, యూరోప్ – 125 యూరో, థాయిలాండ్ – 20 భట్, రష్యా – 50 రూబెల్, ఒమన్ – 1 రియల్, మలేసియా – 22 రింగ్గిట్స్ వచ్చాయని తెలిపారు…..