-ముక్కెర్ల యాదయ్య టీ ఎస్ యూ టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.
యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్.19,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ బీబీనగర్:-గురుకుల ఉపాధ్యాయుల సంస్థల సమస్యల పరిస్కారం కోరుతూ టీఎస్ యుటిఎఫ్ మరియు గురుకుల జేఏసీ పిలుపుమేరకు టి జి ఎస్ డబ్ల్యు ఆర్ ఐ ఎస్ బీబీనగర్ లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ నిరసన ప్రదర్శనకు టీఎస్ యుటిఎఫ్ సంఘీభావం తెలుపుతూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర్ల యాదయ్య మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల,విద్యాసంస్థల సమస్యలు పరిష్కరించాలని,గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని,శాస్త్రీయమైన టైం టేబుల్ ను సవరించాలని,010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని ఇవ్వాలని,కాంట్రాక్ అవుట్సోర్సింగ్ నియమాలకు స్వస్తి పలకాలని,మెస్ చార్జీలు చెల్లించాలని,డిప్యూటీ వార్డెనులను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ సుధర్మారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు వి రమేష్,సిహెచ్ ప్రకాష్,పాఠశాల ప్రధానాచార్యులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు*