అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ న్యూస్ సెప్టెంబర్ 19 జనసముద్రం న్యూస్
తిరుపతి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్) డీఎస్పీగా మురళీధర్ బుధవారం బాద్యతలు చేపట్టారు. ఆయన గతంలోనూ టాస్క్ ఫోర్స్ లో డీఎస్పీ గా పని చేసి ఫిబ్రవరి లో ప్రొద్దుటూరు డీఎస్పీగా బదిలీ అయ్యారు. మరోసారి ఆయనకు టాస్క్ ఫోర్స్ కు బదిలీ కావడంతో బుధవారం బాధ్యతలు చేపట్టారు. తరువాత ఆయన టాస్క్ ఫోర్స్ ఆర్ ఎస్ ఐలు, ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు. టాస్క్ ఫోర్స్ కు మరోసారి రావడం పట్ల అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.