జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 19 ( పామిడి )
పామిడి పట్టణంలోని శ్రీ పురం టౌన్ షిప్ వెంచర్ యాజమాన్యం, చీమలవాగు కాలువను కబ్జా చేసి ప్లాట్లు వేశారని పిర్యాదులు, అందడంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాఖ జిల్లా అధికారి విశ్వనాథ్, బుధవారం పరిశీలించారు.వర్షాలు వస్తే సమీపంలోని కొండ నీరుతో పాటు కొన్ని గ్రామాలు, నాగసముద్రము, అయ్యవారిపల్లి,దేవరపల్లి, జి.కొట్టాల,కాలాపురం,కొండాపురం వంకలు వాగుల నీరు సైతం ఈ చీమలవాగు కాలువ ద్వారా పొర్లి పారుతుండేవని, ఆనీరు దిగువనున్న నాయీబ్రాహ్మణ కాలనీ,వికె.ఆదినారాయణరెడ్డి కాలనీల్లోని కాలువ గుండా కొండూరు దగ్గర పెన్నానదిలో కలసి పోతాయి. అలాంటి వాగులకాల్వను, చెక్కు డ్యాములను, టౌన్ షిప్ యాజమాన్యం పూర్తిగా పూడ్చి వెంచర్ లోనికి కలుపుకొనడంతో వర్షంవస్తే టౌన్ షిప్ తోపాటు ప్రక్కనే వున్న కస్తూరిబా పాఠశాల, మరియు ఎగువన వున్న గ్యాస్ సిలిండర్ గోడౌన్ వీటన్నింటి, చుట్టుపక్కల ప్రాంతమంతా జలమయమై కస్తూరిబా పాఠశాలలోకి, విష సర్పాలు, పాములు తరచూ వస్తున్నాయని పాఠశాల బృందం, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వరదల చీమలవాగు కాల్వను, పూడ్చివేయడం. అన్యాయమని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్లాట్ల రూపంలో లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు, పిర్యాదు ప్రకారం పూడ్చివేసినట్లు గుర్తించామని వాటిని సమగ్రమైన సర్వే చేయించి అక్రమ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు. పైఅధికారులకు నివేదిక అందజేస్తామని, ఎఇ గురుప్రసాద్ తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సంఘం నాయకులు, యంసి.సుంకన్న, కుమార్ తదితరులు పాల్గొన్నారు.