- రెండు గంటలు చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్లు.
- ఉన్నత విద్య అభ్యసించిన మెకానిక్ గా రాణింపు.
జనసముద్రం న్యూస్, కరకగూడెం, సెప్టెంబర్ 15.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,కరకగూడెం మండలానికి చెందిన ఒక నిరుద్యోగి ఉన్నత విద్యను అభ్యసించిన కూడా ఉద్యోగ అవకాశాలు కనిపించకపోవడంతో పెట్రోల్ డీజిల్ వాహనాల సరసన బ్యాటరీ చార్జింగ్ తొ నడిచే వాహనాల పరంపర కొనసాగుతుండంతో మండల కేంద్రంలో సాధారణ మెకానిక్ గా రాణిస్తున్న ఆ యువకుడు బ్యాటరీతో ద్విచక్ర వాహనాన్ని తయారుచేసి అబ్బపరుస్తున్నాడు. కరకగూడెం మండలంలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి మోహంత్ బిటెక్ ఉన్నత విద్య చదివి సరైన అవకాశాలు లేక స్థానికంగా మెకానిక్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు .ఈ క్రమంలోనే పాత మోడల్ టూవీలర్ వాహనాలకు బ్యాటరీ తో నడిచే విధానాన్ని తయారుచేసి ప్రయోగాత్మకంగా వాహనాన్ని నడిపించి పలువురిని అబ్బురపరుస్తున్నారు స్వయం శక్తితో కొద్ది రోజుల్లోనే తయారు చేయగా కేవలం 25 వేల రూపాయల వ్యయంతో వాహన మైలేజ్ ని పరీక్షించాడు. రెండు గంటల ఛార్జింగ్ వ్యవధిలోనే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని, మరిన్ని అవకాశాలు కల్పిస్తే నైపుణ్యంతో ఇంకా అద్భుతమైన ఆవిష్కరణలు చేయగలనని యువకుడు తెలియజేశాడు. నూతన ఆవిష్కరణలతో ప్రజల మనసులను గెలుచుకున్న యువకుడ్ని పలువురు అభినందించారు. ప్రతిరోజు కొద్ది దూరం ప్రయాణించే వారికి ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆ యువకుడు తెలియజేశాడు. చార్జింగ్ వాహనాలు కొనాలంటే లక్షల్లో ఉండడం చేత అతి తక్కువ ఖర్చులో ఇలాంటి వాహనాలు కావాలంటే తాను తయారుచేసి ఇవ్వగలనని అంటున్నాడు.
కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ ప్రశంస:
ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణలు చేసేటి యువకుడు మన మారుమూల మండలంలో ఉండడం ఎంతో ఆనందంగా ఉందని అతని కృషి ఫలితంగా ఈరోజు సాధారణ ద్విచక్ర వాహనాన్ని అతి తక్కువ ఖర్చులో విద్యుత్ వాహనంగా మార్చడం ఆనందంగా ఉంది. ఇలాంటి యువకులని ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని మంచి ఆవిష్కరణలు చేయగలడని అన్నారు.