జనసముద్రం దినపత్రిక ప్రతినిధి, సెప్టెంబర్ 14:
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని బోయపల్లి బోర్డ్ సమీపంలో హెచ్.పీ గ్యాస్ ముందు సర్వీస్ రోడ్డు వద్ద నేషనల్ హైవే అధికారుల తప్పిదంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బోయపల్లి బోర్డు దాటగానే ఎండింగ్ సర్వీస్ రోడ్డు వద్ద ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు క్రాస్ చేసుకొని సర్వీస్ రోడ్ లో వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. క్రాస్ చేసే చోట డ్రైనేజీ నిర్మించి అసంపూర్తిగానే వదిలేశారు. వర్షాకాలం కావడంతో కొంత భాగం సర్వీస్ రోడ్డు కోతకు గురైంది. ఇలా ఉండి చాలా రోజులైనా కూడా హైవే పెట్రోలింగ్ వాహనం గుర్తించి హైవే అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం చూస్తే వీళ్లు వీధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వద్ద భారీ పైపు వేసి మట్టితో లెవెల్ చేస్తే రోడ్డు కోతకు గురికాకుండా ఉంటుందని వాహనాలు కూడా సులువుగా వెళ్లే అవకాశం ఉందని వాహనదారులు తెలుపుతున్నారు.