అధ్యక్షులుగా బచ్చోటి భాస్కర్, కార్యదర్శిగా మందా శివయ్య
రాజంపేట -జన సముద్రం న్యూస్
రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సంక్షేమమే లక్ష్యంగా రాజంపేట ప్రెస్ క్లబ్ కమిటీ ముందుకు సాగాలని సీనియర్ పాత్రికేయులు కళాంజలి అప్పారావు, తాలూకా అధ్యక్షులు ఇండ్లూరి వెంకటరెడ్డి, గౌరవ అధ్యక్షులు జవ్వాజి మల్లికార్జున అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ సభా భవనంలో రాజంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం బాటలు వేయలన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలను మంజూరు చేసేందుకు కృషి చేయాలన్నారు. అక్రిడేషన్ల మంజూరిలో షరతులు విధించరాదన్నారు. విద్య, వైద్యంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వెయ్యాలన్నారు. నూతనంగా బీజం వేసుకున్న రాజంపేట ప్రెస్ క్లబ్ కమిటీ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని ఆకాంక్షించారు. రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా ముందుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.
నూతన కార్యవర్గం ఎన్నిక..
రాజంపేట ప్రెస్ క్లబ్ గౌరవ తాలూకా అధ్యక్షులుగా
వెంకటరెడ్డి (సాక్షి)గౌరవ అద్యక్షులుగా జవ్వాజి మల్లికార్జున (వార్త) ఎస్ అప్పారావు(ఆంధ్రభారతి)ఈశ్వరయ్య (ఏబీఎన్)గౌరవ సలహాదారులుగా కొత్తపల్లి గణేష్,(సాయంకాలం)
మలిశెట్టి సుబ్బ నరసింహులు(అన్నమయ్య బుక్)నాగరాజు ఆచారి (ఆచార్య టీవీ)అద్యక్షులుగా
బచ్చోటి భాస్కర్ (విశాలాంధ్ర) ఉపాధ్యక్షులుగా ఓబులేసు (ఐన్యూస్) శివయ్య నాయుడు (ఆంధ్రప్రభ)చామంచి హరి (టీవీ5) రమణ (దిశ)ప్రధాన కార్యదర్శిగా మందా శివయ్య (ఆంధ్ర ప్రభ),కోశాధికారిగా బాలి పోగు సునీల్ (ప్రజాశక్తి)కార్య నిర్వాహక కార్యదర్శులుగా ఉదయగిరి కళ్యాణ్(ఆంధ్రజ్యోతి)
ఎం. శ్రీహరి (సుమన్ టీవీ) నామ నరసింహ (నేటి సూర్య) బి. నాగేంద్రప్రసాద్ (నేటి మన దేశం)ఈ. శివయ్య(మహా న్యూస్)సహాయ కార్య దర్శులుగా ప్రశాంత్ (ప్రైమ్ 9)చామంచి వెంకటసుబ్బయ్య (అంతరాత్మ)చౌడవరం నరసింహ (టీవీ15)పసుపులేటి దుర్గయ్య (జీ తెలుగు) కార్యవర్గ సభ్యులుగా రాయలు (తరణం)పి. దివాకర్ (అక్షర టైమ్స్)టి.చంద్రశేఖర్ (అంకుశం)కె. మధుసూదన్ (ఆంధ్రప్రభ)చమర్తి వెంకటేశ్వర రాజు, సుధాకర్ (డ్రీమ్ టైమ్స్) శివ (ఎన్ఎస్ టీవీ)సంపతి. కృష్ణయ్య (ప్రజా కీర్తి) విజయ్ కళ్యాణ్ (ప్రజా విలేఖరి)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు