జన సముద్రం న్యూస్ మాచర్ల సెప్టెంబర్ 14.
అధికారం దక్కలేదనే అక్కస్ తోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలపై కక్షగట్టి, పగ తీర్చుకునేలా బోట్లతో ఢీ కొట్టి బ్యారేజీని కూల్చేందుకు కుట్రపన్నాడని, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ కార్యాలయంలో గురువారం యాగంటి మల్లికార్జునరావు విలేకరులతో మాట్లాడుతూ, వృద్ధాప్య వయసులో కూడా తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారగణంతో, వరద బాధితులను ఆదుకున్నారన్నారు. లక్షలాదిమందిని జల సమాధి చేసేందుకు 50 టన్నుల బరువైన 3 బోట్లను వరద నీటిలో వదిలి, బ్యారేజీని కూల్చేందుకు జగన్ ఆలోచనలు దుర్మార్గం అన్నారు.
మచ్చలేని చంద్రబాబుపై బురదజల్లేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రజలు నమ్మరన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పురోగతి జరుగలేదన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో బుడమే రు కాలువ మరమ్మత్తులకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తే, ఆ టెండర్లను జగన్ ఎందుకు రద్దు చేశాడో సమాధానం చెప్పాలన్నారు. బుడమేరు భారీ వరద ఉద్ధృతికి కారణం జగన్ తప్పిదమేనన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లను వరదనీటిలో వదిలారని అధికారుల విచారణలో తేటతెలమైందన్నారు.
అప్పుడు బాబాయ్‌ని చంపి గుండెపోటుగా చూపించారని, ఇప్పుడు బ్యారేజీని బోట్లతో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరించడం
జగన్ కు అలవాటుగా మారిందన్నారు.
భారీ విపత్తుతో విజయవాడ ప్రజలంతా అల్లాడుతుంటే ప్రభుత్వానికి సహకరించి ప్రజలను ఆదుకోవాల్సిన జగన్, వంద తప్పులు చేసి జైళ్ళపాలైన తన పార్టీ నేతల వద్దకు వెళ్లి, ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం హేయమన్నారు. ఇప్పటికైనా జగన్ ధోరణి మార్చుకోవాలన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా నరకం చూసారని, జగన్ చేసే కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలకు కావలసింది స్వేచ్ఛ, సంక్షేమం, అభివృద్ధి అని, అది సీఎం చంద్రబాబు తోనే సాధ్యమని ప్రజలు నమ్మి విశ్వాసంతో ఉన్నారన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో అధికారం ఇచ్చిన ప్రజలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిన ముఖ్యమంత్రిని ఒక్క జగన్ నే చూశానన్నారు. ప్రజాస్వామ్యంలో కుట్ర, కక్ష సాధింపు రాజకీయాలకు తావుండదని, విషయాన్ని జగన్ తెలుసుసుకోవాలని హితవు పలికారు.
మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల
Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…